
ప్రతి అమ్మాయి తన కడుపు పండాలని తనకో బిడ్డ పుడితే అమ్మ ప్రేమని పంచాలని ఎంతగానో ఎదురుచూస్తుంది. అయితే.. కొంత మందిలో కొన్ని అనుకోని కారణాల వల్ల అబార్షన్ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు వద్దు అనుకునే వారు కూడా అబార్షన్ చేసుకుంటున్నారు. అయితే.. కారణాలు ఏవైనా అబార్షన్ జరిగిన తరువాత తిరిగి ప్రెగ్నంట్ కావడం కష్ట తరమా? చాలా మందిలో ఈ సందేహం నెలకొనే ఉంది. అయితే.. ఈ సందేహం తీరాలంటే కొన్ని విషయాలను లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి. ముందుగా అబార్షన్ జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అబార్షన్ జరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఉద్దేశ్యపూర్వకంగా చేసుకునే అబార్షన్ల సంగతి పక్కన పెడితే.. అనుకోకుండా అబార్షన్ జరిగిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. తల్లి తండ్రుల వయసు కూడా అబార్షన్ కావడానికి కారణమే. హార్మోన్లలో హెచ్చు తగ్గులు, జన్యు పరమైన కారణాలు, ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ను వాడడం, గర్భాశయ ఆకృతిలలో లోపం ఉండడం, శిశువు నిర్మాణంలో లోపం ఉండడం వంటి కారణాల వలన అబార్షన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ప్రెగ్నంట్ మహిళకు ఏమైనా సమస్యలు ఉండి తల్లి ప్రాణానికే ప్రమాదం అని తెలిసిన వెంటనే డాక్టర్లు అబార్షన్ చేయించుకోవాలని సూచిస్తుంటారు.
చాలా మందిలో నెలకొనే సందేహం ఒకటే. అబార్షన్ జరిగిన తరువాత తిరిగి గర్భధారణ సాధ్యమవుతుందా? అని. అయితే.. ఆ భయం అవసరంలేదు. నిజానికి అబార్షన్ అనేది గర్భ ధారణ ప్రక్రియను ప్రభావితం చెయ్యదు. అయితే.. కొన్ని సందర్భాలలో అబార్షన్ కారణంగా తిరిగి గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని వలన గర్భం దాల్చడం ఆలస్యం అవుతుంది.
అబార్షన్ తరువాత గర్భం దాల్చడానికి శరీరం కొంత సమయం తీసుకుంటుంది. అలాగే.. కొన్ని అరుదైన సందర్భాలలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. సర్జికల్ అబార్షన్ జరిగినప్పుడు గర్భాశయ లైనింగ్ పై మచ్చలు ఉన్నా, లైనింగ్ దెబ్బతిన్నా తిరిగి గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితిని అషెర్మాన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీనిని శస్త్ర చికిత్స ద్వారా సరి చేస్తారు. గర్భాశయంలో దెబ్బ తిన్న కణజాలాలలను తొలగిస్తారు.
అలాగే, అబార్షన్ జరిగిన తరువాత గర్భాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా తిరిగి గర్భం దాల్చడం కష్టం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. లేకుంటే.. పూర్తిగా ఇన్ ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు దీని వలన అబార్షన్ తర్వాత.. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గర్భాశయం వెలుపల గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి గర్భాలు నిలిచే అవకాశాలు ఉండవు. అబార్షన్ చేసిన తరువాత పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, అధిక రక్త స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పిల్లలని కనడం అనేది ప్రతి అమ్మాయి కల. కానీ అబార్షన్ అన్న ఒక్క కారణంతో ఆ కల ఆగిపోదు. అయితే.. కొన్ని సమస్యలు ఎదురవ్వడం మాత్రం సహజమే. వాటికి సరైన సమయంలో స్పందించి చికిత్స తీసుకుని, వైద్యుని సలహాలతో తిరిగి గర్భధారణ చేయవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా?




This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |